11 ఏళ్లకు నిద్రలోకి జారుకుని 21 ఏళ్లకు మేల్కొన్న ఘటన..
ఆమెకు ట్రైపానోసోమియాసిస్ అంటే.. స్లీపింగ్ సిక్నెస్ అని గుర్తించిన వైద్యులు..
నిజంగా ఇది అద్భుతమే అంటున్న నిపుణులు..
మనం పడుకునేటప్పుడు గుడ్ నైట్ అంటారు ఎందుకో తెలుసా.. తిరిగి తెల్లారి ఆనందంగా నిద్ర లేవాలనే. ఆ రాత్రి మనకు ఎలాంటి సమస్యలూ లేకుండా హాయిగా నిద్ర పట్టాలనీ, తెల్లారి ప్రాణాలతో లేవాలనీ ఇలా ఎన్నో మంచి ఉద్దేశాలు గుడ్ నైట్ అనే మాట వెనక ఉన్నాయి. నిజంగానే నిద్ర వల్ల చాలా బెనెఫిట్స్ ఉంటాయి. బాడీలో ప్రతీ పార్టూ రిఫ్రెష్ అవుతుంది. బ్రెయిన్ తిరిగి యాక్టివ్ అవుతుంది. తెల్లారి మళ్లీ న్యూ మార్నింగ్ మొదలవుతుంది. ఎప్పుడైనా మనం గంటల తరబడి నిద్రపోయే వారిని చూసి ఉంటాం గానీ.. ఏళ్ల తరబడి నిద్రపోయే వాళ్లను చూసి ఉండం.
సినిమాల్లో రాణి.. తన కూతురికి పిట్టకథ చెప్పి.. ఓ ముద్దిచ్చి నిద్రపుచ్చుతుంది. ఆ తర్వాత ఆ బాలిక.. మరో ప్రపంచంలో విహరిస్తుంది. కొన్ని నెలల తర్వాత నిద్ర లేస్తుంది. అదంతా ఒక ఫెయిరీ టేల్ లాగా ఉంటుంది. ఈ కథ అలాంటిది కాదు. ఇది నిజంగా జరిగింది. ఆ బాలిక సంవత్సరాల తరబడి నిద్రపోయింది కానీ.. లేచిన తర్వాత.. ఆమెకు, తాను అన్ని సంవత్సరాలు నిద్రపోయిన విషయమే తెలియలేదు.ఇది 19వ శతాబ్దంలో జరిగిన ఘటన. బ్రిటన్‌లో ఎల్లెన్ సాడ్లెర్ అనే 11 ఏళ్ల బాలిక బెడ్‌పై నిద్రలోకి జారుకుంది. తిరిగి 9 ఏళ్ల తర్వాత 21 సంవత్సరాల వయస్సులో నిద్రలేచింది. అప్పట్లో వైద్య శాస్త్రం అంత మోడ్రన్‌గా లేదు. అందువల్ల ఆమెను నిద్రలేపలేకపోయారు. స్వయంగా నిద్రలేచాక.. ఆమెకు అంతా కొత్తగా అనిపించింది. అదే సమయంలో 9 ఏళ్లు నిద్రపోయినట్లు ఆమెకు అస్సలు అనిపించలేదు.
ఎల్లెన్‌కి ఏమైంది అనే దానిపై జరిపిన పరిశోధనల్లో ఒక విషయం తెలిసింది. ఆమెకు ట్రైపానోసోమియాసిస్ ఉంది. అంటే.. స్లీపింగ్ సిక్నెస్. ఈ సమస్య ఉన్న మొదటి బాలిక ఆమే. చరిత్ర ప్రకారం 1859 మే 15న ఎల్లెన్ పుట్టింది. 12 మంది పిల్లల ఫ్యామిలీలో ఒక భాగంగా ఉంది. ఆమె పదో బిడ్డ. ఆమె కుటుంబం బ్రిటన్‌లో ఆక్స్ఫర్డ్, బకింగ్‌హామ్‌షైర్ మధ్య ఉండే టుర్విల్లే గ్రామంలో నివసించేది. ఆమె తండ్రి ఒక రైతు. ప్రమాదం కారణంగా చిన్న వయసులోనే ఆయన చనిపోయారు. ఆ తర్వాత తల్లి ఒక ఫ్యాక్టరీ వర్కర్ని పెళ్లి చేసుకుంది.1871లో ఓ రోజు.. తన తోబుట్టుువులతో కలిసి ఎల్లెన్ కూడా రాత్రి నిద్రపోయింది. తెల్లారి నిద్రలేవలేదు. ఆమెను అటూ ఇటూ కదిపారు, ముందుకీ వెనక్కీ తోశారు, చెవిలో గట్టిగా అరిచారు, ఏం చేసినా నిద్రలేవలేదు. విషయం చుట్టుపక్కల వారికి తెలిసింది. వారు వచ్చి.. ఎల్లెన్ కోసం డబ్బు ఇచ్చారు. కానీ ఆమెకు ఏమైందో వారికీ తెలియదు. ఆ తర్వాత ఆమె సజీవ టూరిస్ట్ ఎట్రాక్షన్ అయిపోయింది. ఆమెను స్లీపింగ్ గర్ల్ అని పిలిచేవారు. ఆమెను ఒక దేవతలా భావిస్తూ.. ఆమె జుట్టులోని ఒక వెంట్రుక కోసం డబ్బు ఇచ్చేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు.. ఆమె ఇంటికి వెళ్లి చూసేవారు. కానీ ఎవరూ ఏమైందో చెప్పలేకపోయారు.
ఆమె బతికే ఉంది, కానీ నిద్రలేవట్లేదు, అందరికీ అదే ఆశ్చర్యం. ఆమె తల్లి.. ఆమెకు చిన్న టీపాట్‌లో ఓట్ మీల్, పాలు, వైన్ వంటివి ఆహారంగా ఇచ్చేది. కానీ నిద్రపోయేవారికి ఆహారం ఇవ్వడం చాలా కష్టం. ముఖ్యంగా వారి నోరు మూసి ఉంటే.. దవడలు తెరచుకోవు. ఎల్లెన్‌కి ఇలాగే ఉండేది. దాంతో ఆమె తల్లి.. దంతాల మధ్య ఉండే చిన్న గ్యాప్‌లో ఆహారం అందిస్తూ ఉండేది. కానీ.. ఓ రోజు ఆమె హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది. ఎల్లెన్ లేవకముందే ఇది జరిగింది. ఆమె చనిపోయిన 5 నెలల తర్వాత ఎల్లెన్ నిద్ర లేచింది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎల్లెన్‌కి టైమ్ పట్టింది. ఎందుకంటే.. ఆమె 11 ఏళ్ల బాలిక లాగానే ఆలోచించసాగింది.ఎల్లెన్‌కి నార్కోలెప్సీ అనే సమస్య వచ్చింది. ఇది వచ్చిన వారికి ఒరెక్సిన్ కొరత ఏర్పడుతుంది. ఒరెక్సిన్ అనేది.. ఒక రకమైన బ్రెయిన్ కెమికల్. ఇది నిద్ర నుంచి లేచేలా చేస్తుంది. ఇది కొరతగా ఉండటం వల్లే ఎల్లెన్ లేవలేదని తెలిసింది. మొత్తంగా ఎల్లెన్ ఆ తర్వాత పెళ్లి చేసుకుంది, ఆమెకు ఆరుగురు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత 1910లో ఆమె ఎలాంటి కారణం లేకుండానే 51 ఏళ్ల వయసులో చనిపోయింది.