ఎల్బీనగర్
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పరిధిలో హరిహరులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుర ఉపేందర్ రెడ్డి దంపతులు డివిజన్ పరిధిలోని పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్కాపురి కాలనీలోని శ్రీ భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి దేవాలయాన్ని, శ్రీ రామకృష్ణా పురం కాలనీలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, వాసవి కాలనీ లోని ఆధ్యాత్మిక కేంద్రంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వార్లను దర్శించుకున్నారు.
అదేవిధంగా ఐటీఎఫ్ఈఎస్ కో- ఆపరేటివ్ సొసైటీ(ఆర్కే పురం) కాలనీలో రాఘవాచార్యులు నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు.



