Friday, November 27, 2026
Google search engine
Homeతెలంగాణవికసిత్ భారత్ – యంగ్ ఇండియా లీడర్ డైలాగ్ – 2026

వికసిత్ భారత్ – యంగ్ ఇండియా లీడర్ డైలాగ్ – 2026

జిల్లా స్థాయి పిపిటీ ఛాలెంజ్ ట్రాక్ పోటీలు విజయవంతం

ఎల్బీనగర్

వికసిత్ భారత్ – యంగ్ ఇండియా లీడర్ డైలాగ్ – 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి ఛాలెంజ్ ట్రాక్ పిపిటీ పోటీలను గురువారం కొత్తపేటలోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డా.కె. కిరణ్మయి ఐఏఎస్ ముఖ్యఅతిథిగా కార్యక్రమ చైర్మన్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువత దేశ అభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో చురుకైన పాత్ర పోషించాలని ఆమె సూచించారు.ఈ పోటీలలో భాగంగా జిల్లా స్థాయి పిపిటీ ఛాలెంజ్ ట్రాక్‌లో పాల్గొనేందుకు మొత్తం 65 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 6 మంది అభ్యర్థులు రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ఎంపికయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి శ్రీమతి ఎస్. స్వర్ణలత, డా. కె. సురేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. ఎన్. రాజ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్నేహల్, డిప్యూటీ డైరెక్టర్, మై భారత్, అవినాష్ కాలేజ్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనలు, సామాజిక బాధ్యత మరియు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే స్ఫూర్తిని పెంపొందించడమే ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments