Wednesday, February 11, 2026
Google search engine
Homeబిజినెస్ట్రంప్ గెలుపుతో కిందికి దిగిన బంగారం ధరలు..

ట్రంప్ గెలుపుతో కిందికి దిగిన బంగారం ధరలు..

గోల్డ్‌కు ట్రంప్‌ గుబులు
దేశీయ విపణిలో క్రమేణా క్షీణిస్తున్న ధరలు
గత 10 రోజుల్లో తులం రూ.5,350 తగ్గుదల
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపుతో మార్కెట్‌ రివర్స్‌గేర్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం.. గోల్డ్‌ మార్కెట్‌ పతనానికి దారితీస్తున్నది. ఈ నెల 4న ట్రంప్‌ గెలిచినట్టు అధికారికంగా వెల్లడైన విషయం తెలిసిందే. అయితే అప్పట్నుంచి ఇప్పటిదాకా దేశీయ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్‌ (99.9 స్వచ్ఛత) బంగారం ధర రూ.5,350 (6.5 శాతం) పడిపోవడం గమనార్హం. డాలర్‌ ఇండెక్స్‌ (డీఎక్స్‌వై) అంతకంతకూ బలపడుతుండటం.. బులియన్‌ మార్కెట్‌ను బేరిష్‌ ట్రెండ్‌లోకి నెడుతున్నది. ప్రస్తుతం తులం రూ.77వేల దరిదాపుల్లో ఉన్నది. గత నెలాఖరున మునుపెన్నడూ లేనివిధంగా రూ.82,400 పలికిన సంగతి విదితమే. హైదరాబాద్‌లో తులం 22 క్యారెట్‌ రేటు రూ.70వేలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిదాకా డౌన్‌ట్రెండ్‌ కొనసాగవచ్చన్న అంచనాలే వినిపిస్తున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక, పాలసీ నిర్ణయాలు వచ్చేదాకా గోల్డ్‌ రేట్‌ కరెక్షన్‌ ఉంటుందంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments