తమ డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లిన అధ్యక్షుడు జీ. రాజేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి టి. కృష్ణ..
భాగ్యనగర్ మున్సిపల్, జిహెచ్ఎంసి ఎంప్లాయిస్ యూనియన్ రికగ్నైజేడ్ యూనియన్ (బీ.ఎం.ఎస్.) ఈజిస్టర్డ్ నెంబర్ : బీ- 1157 ప్రతినిధులు శుక్రవారం రోజు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మునిసిపల్ శాఖ మంత్రిని, అలాగే చీఫ్ సెక్రటరీ ని ఎం.ఏ.యూ.డీ. ప్రిన్సిపల్ సెక్రెటరీకి, జిహెచ్ఎంసి కమిషనర్ కి, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలవడం జరిగినది.. ఉద్యోగులకు రావాల్సిన 5 డిఏలు.. అలాగే పిఆర్సి, పర్మినెంట్ ఉద్యోగులందరికీ కూడా 150 గజాల ఇంటి స్థలాలను కేటాయించాలని.. అలాగే జిహెచ్ఎంసిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ, అన్ని విభాగాల వారిని పర్మినెంట్ చేయాలని.. వారి వారి కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది.. భాగ్యనగర్ మున్సిపల్ జిహెచ్ఎంసి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు
జి. రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి టి. కృష్ణ అడిషనల్ జనరల్ సెక్రెటరీ రాధాకృష్ణ, నాయకులు జాల నరేందర్ యాదవ్, ప్రద్యుమ్న, హెడ్ ఆఫీస్ ఇంచార్జ్ పవన్, రసూల్, రాఘవేంద్ర, నరేందర్, లక్ష్మీ కుమార్, శివశంకర్, ఆనంద్, యాదయ్య, అమర్నాథ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..