Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణజననేతకు జన్మదిన శుభాకాంక్షలు..

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు..

పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపిన సి.హెచ్. భాస్కరాచారి..

ఆయన భోళా మనిషి, చిన్నపిల్లలా మనస్తత్వం.. మనసులో ఏదీ దాచుకునే వ్యక్తి కాదు.. వున్నది ఉన్నట్లు మాట్లాడటం ఆయనకు ఆభరణం.. పేదలంటే ఆయనకు ప్రాణం.. ఒక చేతికి తెలియకుండా ఇంకో చేత్తో సహాయం చేసే వ్యక్తి.. ఇందుకు ఎన్నెన్నో దృష్టాంతాలు మనం చూశాం.. ఆయనే తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయనను అభినందనలతో ముచ్చేత్తారు.. కోమటి రెడ్డి అంటే సొంత పార్టీలోనే కాదు.. ఇతర పార్టీ నాయకులు కూడా ఎంతో గౌరవిస్తారు.. అభిమానిస్తారు.. ఇటీవల బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ఒకానొక సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అభినందనలతో ముంచెత్తారు.. కల్మషం లేని నాయకుడని కొనియాడారు.. అలాంటి మంచి వ్యక్తిత్వం గల నాయకుడు చాలా అరుదుగా కనిపిస్తుంటారు..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా గడ్డి అన్నారం మార్కెట్ వైస్ చైర్మన్ సి.హెచ్. భాస్కరా చారి ఆయనను కలిసి శాలువాతో సత్కరించి, పూల బొకేతో శుభాకాంక్షలు తెలియజేశారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments