సరూర్ నగర్ సర్కిల్ లోని పలు కాలనీల్లో నిర్వహణ..
జీ.హెచ్.ఎం.సి. ఆదేశాల మేరకు చర్యలు..
రాబోవు వర్షాకాలం నందు ప్రజారోగ్యము, పారిశుద్ధ్య విషయమై ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని జిహెచ్ఎంసి అన్ని సర్కిల్ ల యందు ముందస్తు వర్షాకాల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని జీ.హెచ్.ఎం.సి కమిషనర్ ఆదేశించారు.. అందులో భాగంగా గురువారం రోజు సరూర్ నగర్ సర్కిల్ లక్ష్మీనగర్, ఎస్.బీ.ఐ. కాలనీ, విజయపురి కాలనీ, కల్కి నగర్, చేరుకుతోట కాలనీ, ఇందిరా హిల్స్, అంబేద్కర్ నగర్, హుడా ఎంప్లాయీస్ కాలనీ, శంకర్ నగర్ ప్రాంతాల యందు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కాలనీల రోడ్లను, ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేసి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి చెత్తను ఎత్తివేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ సర్కిల్ పారిశుద్ధ్య విభాగం డి ఈ చందన చౌహాన్, సానిటరీ సూపర్వైజర్ బుచ్చయ్య, ఎస్ ఎఫ్ ఏ లు, జవాన్లు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలు వారి ఇంటి నుండి, వ్యాపార స్థలాల నుండి వెలువడే చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడ వేయకుండా జిహెచ్ఎంసి స్వచ్ఛ ఆటో వారికి అందించాలని.. ఎక్కడపడితే అక్కడ పడవేయడం వలన వర్షాకాలంలో నాళాలు, మోరీలు చెత్తతో నిండిపోవడం వలన వర్షం నీరు కాలనీలలో నిలిచిపోయి దుర్వాసన, ప్రాణాంతకమైన అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఈ సూచనలను పాటించాలని, ఇంటి పరిసరాలలో నీరు నిరువకుండా అందువల్ల దోమలు అభివృద్ధి చెందకుండా మన వంతు బాధ్యతగా ఉండాలని తెలియజేశారు.


