Tuesday, July 22, 2025
Google search engine
Homeతెలంగాణఇది కదా హైడ్రా అంటే..

ఇది కదా హైడ్రా అంటే..

ఆనందం వ్యక్తం చేస్తున్న నగరవాసులు..
బిఫోర్ – ఆఫ్టర్ లా మారిన నగరంలోని నాలాలు
నగరంలో పెద్దఎత్తున పూడిక తీత పనులు..
హైడ్రా రంగంలోకి దిగడంతో మారిన పరిస్థితి..
ఊపిరి పీల్చుకుంటున్న నగర ప్రజలు..

నగరంలో నాలాల పరిస్థితి బిఫోర్ – ఆఫ్టర్ లా మారింది. హైడ్రా రంగంలోకి దిగడంతో నాలాల్లో, కల్వర్టుల వద్ద పూడికతీత పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయి. హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, డీ.ఆర్.ఎఫ్. బృందాలు సంయుక్త ఆధ్వర్యంలో కల్వర్టులు క్లియర్ అవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, థర్మోకోల్, చెత్త, పిచ్చి మొక్కలను తొలగించడంతో పూడుకు పోయిన నాలాలు, కల్వర్టులు తెరుచుకున్నాయి. లారీలకొద్దీ చెత్తను తొలగించడంతో వరద సాఫీగా వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. తొలగించిన చెత్తను వెంటనే ఆ పరిసరాల్లోంచి తరలించడంతో నివాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జూలై 1 వ తేదీ నుంచి మొదలయిన పనులు :
ఈ నెల 1వ తేదీ నుంచి హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, హైడ్రా డీ.ఆర్.ఎఫ్. బృందాలు సంయుక్తాద్వర్యంలో ఆపరేషన్ నాలా, కల్వర్టుల క్లీనింగ్ పనులు మొదలయ్యాయి. జీ.హెచ్.ఎం.సి. పరిధిలో మొత్తం నాళాలను, కల్వర్టులను, ముంపు ముప్పు ఉన్న ప్రాంతాలను ఈ బృందాలు జల్లెడ పట్టాయి. జీ.హెచెం.సి., జలమండలి సహకారంతో నాలాలు, కల్వర్టుల క్లీనింగ్ పనులను ముమ్మరం చేశాయి. వర్షం పడినప్పుడు వరద నీరు నిలబడకుండా, రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా పర్యవేక్షించే బృందాలు.. వర్షం లేని ఖాళీ సమయాన్ని నాళాలు, కల్వర్టులు, మ్యాన్ హాల్స్ క్లియర్ చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి. హైడ్రా డీ.ఆర్.ఎఫ్. అధికారులు క్షేత్రస్థాయిలో సర్కిళ్లవారీ ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో నాలాలు, కల్వర్టులు రూపు రేఖలు మారాయి. పిచ్చి మొక్కలతో, పేరుకుపోయిన చెత్తతో ఉన్న మ్యాన్ హోల్స్, కల్వర్టులు యిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి. మురుగు, వరద నీరు ముందుకు కదలకుండా ఉక్కిరిబిక్కిరి అయిన నాళాలు, కల్వర్టులు హమ్మయ్య అని సేదదీరుతున్నాయి. కాలువ పరిసరాల్లో నివాసముంటున్న ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. కాలువల్లో నీరు సాఫీగా సాగిపోవడాన్ని చూసి హమ్మయ్య అనుకుంటున్నారు.

నాలాల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా :
నాలాల్లో చెత్తనే కాదు ఆక్రమణలను కూడా హైడ్రా తొలగించుతోంది. ఖైరతాబాద్ శ్రీధర్ ఫంక్షన్ హాల్ వద్ద బుల్కాపూర్ నాలా ఆక్రమణలను తొలగించింది. కూకట్పల్లి ఐడీఎల్ చెరువు నాలా ఆక్రమణలను కూడా తొలగించింది. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద నాలా కల్వర్టులో పెద్దఎత్తున పేరుకుపోయిన వ్యర్థాలను హైడ్రా యుద్ధప్రాతిపదికన తొలగించింది. లాంగ్ ఆర్మ్ జేసీబీతో చెత్తతో పాటు థర్ర్మోకోల్, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి లారీలకు నింపి తరలించింది. యిప్పుడు అక్కడ వరద సాఫీగా సాగడాన్ని చూసి స్థానికులు.. యిది కదా హైడ్రా అంటే అని కొనియాడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments