Saturday, July 19, 2025
Google search engine
Homeతెలంగాణసాహెబ్ నగర్ గ్రామ ఎస్సీ స్మశాన వాటిక అభివృద్ధి పనులు..

సాహెబ్ నగర్ గ్రామ ఎస్సీ స్మశాన వాటిక అభివృద్ధి పనులు..

26,00,00 లక్షల రూపాయలతో పనులు ప్రారంభం..
పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..

బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని, సాహెబ్ నగర్ గ్రామ ఎస్సీ స్మశాన వాటిక 26,00,000 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న స్మశాన వాటిక పనులు ప్రారంభించిన నేపథ్యంలో గ్రామ వాసుల విజ్ఞప్తి మేరకు బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పర్యవేక్షించడం జరిగింది.

ఎస్సీ స్మశాన వాటిక అభివృద్ధి కొరకు 26,00,000 లక్షల రూపాయలు మంజూరు చేయించినందుకు గ్రామ సభ్యులు కార్పొరేటర్ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అనంతరం బస్తీలో నూతన ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ సంఘం భవనం నిర్మించాలని కార్పొరేటర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సాహెబ్ నగర్ గ్రామ సభ్యులు బాబయ్య, అంజయ్య, శేఖర్, రాజు, దేవరాజు, బలరాం, సుధాకర్, రమేష్, రాజు, మధు, సంజీవ, స్వామీ, శ్రీనివాస్, చిరంజీవి, కుమార్, నివాస్ మధు, భాను, హరి కృష్ణ, మహేష్, దుర్గా ప్రసాద్, శివకుమార్, వికాస్, పరమేష్, యశ్వంత్, లోకేష్.. మహిళా సభ్యులు లక్ష్మమ్మ, జయమ్మ, రజిత, శోభా, అనిత, అమృత, స్వప్న, నవనీత, జ్యోతి, రేణుక, పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments