నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
కాలనీ అభివృద్ధి కోసం ఎల్లవేళలా తన సహాయ సహకారాలు వుంటాయని హామీ..
హయత్ నగర్ డివిజన్ లోని భాగ్యలత బీడీఎల్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు శుక్రవారం రోజు స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిని వారి నివాసంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ నూతన కార్యవర్గ సభ్యులను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.. అలాగే కాలనీ అభివృద్ధి పనులకు ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.. అదే విధంగా బీడీఎల్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఈ ఆదివారం రోజున కాలనీలో అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాల పండుగలో కార్పోరేటర్ ని ముఖ్య అతిథులుగా పాల్గొనవలసిందిగా ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు బాబు, కొండల్ రెడ్డి, శ్రీనివాస్, బాల సిద్ధులు, చంద్రశేఖర్, జనార్దన్ రెడ్డి, జంగారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, లింగం, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..