సంపూర్ణ మద్దతు ప్రకటించిన డీవైఎఫ్ఎస్ఐ రాష్ట్ర కమిటీ..
వివరాలు తెలిపిన సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు మీసాల వీరబాబు..
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ కు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఎస్ఐ) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.మంగళవారం హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి వై ఎఫ్ ఐ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మీసాల వీరబాబు మాట్లాడుతూ డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ కి సహకరించాలని అన్నారు.అదే విధంగా ప్రయివేటు,కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని అనేక ఏండ్లుగా విద్యార్థి, యువజన సంఘాలు పోరాటాలు చేశాయని తెలిపారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిలేకపోవడం వల్లే విద్యారంగం కుంటుపడిందని తెలిపారు పెండింగ్ లో ఉన్న రూ. ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను కల్పించాలనీ, నిధులను కేటాయించాలని కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి.ఎన్ ఈ పి -2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలి సూచించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఇందిరాల నరేష్,పట్టణ కమిటీ సభ్యులు పవన్, సతీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.