కార్యక్రమంలో పాల్గొన్న రాచకొండ కమిషనర్ జీ. సుధీర్ బాబు ఐపీఎస్..
ఉప్పల్ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ పరిష్టితి సమీక్ష, అధికారులకు సూచనలు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, ఐపీఎస్, ఉప్పల్ ఎక్స్ రోడ్స్ వద్ద ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వాహనాల సజావుగా కదలిక, ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు. తానే స్వయంగా చొరవ తీసుకుని ట్రాఫిక్ పై దృష్టి పెట్టినందుకు కమిషనర్ పై స్థానికులు ప్రశంసలు కురిపించారు..