ఎల్బీనగర్:
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కృంగిపోయిన మ్యాన్‌హోల్స్‌ను తక్షణమే పునరుద్ధరించి, డివిజన్లో నెలకొన్న తాగునీరు, మురుగునీటి సంబంధిత వివిధ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని గడ్డిఅన్నారం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) డీజీఎం చంద్రు నాయక్ ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గడ్డిఅన్నారం డివిజన్లో పలుచోట్ల మ్యాన్‌హోల్స్ కృంగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. అలాగే తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన పెండింగ్ సమస్యలను కూడా అధికారులు ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.వినతిపత్రాన్ని స్వీకరించిన జలమండలి డీజీఎం చంద్రు నాయక్ సమస్యలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.


