- *బాలాపూర్ మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
- *అధ్యక్షులుగా కె.మహిపాల్ రెడ్డి (ఈనాడు), ప్రధాన కార్యదర్శిగా ఎస్. జయంత్ (నవతెలంగాణ)
- *జర్నలిస్టుల సంక్షేమం, హెల్త్ కార్డ్స్ సాధనే ధ్యేయంగా రాజీలేని పోరాటం
బాలాపూర్:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టులో భాగంగా కేటాయించే ఇళ్ల స్థలాలలో రంగారెడ్డి జిల్లాకు చెందిన అర్హులైన జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే – ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గురువారం బాలాపూర్ మండలం, బడంగ్పేట్ కేంద్రంలో నిర్వహించిన టీయూడబ్ల్యూజే బాలాపూర్ మండల నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ ప్రాంత జర్నలిస్టుల కోసం ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రక్రియలో, గత రెండు దశాబ్దాలుగా అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న రంగారెడ్డి జిల్లా అర్హులైన జర్నలిస్టులందరికీ సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ కృషితో.. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సేవలందేలా జర్నలిస్టులకు హెల్త్ కార్డ్స్ మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే యూనియన్ సభ్యులందరికీ రూ. 5 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.
*రాజీలేని పోరాటమే మా లక్ష్యం: జిల్లా నాయకత్వం
జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ సలీం పాషా, మేకల సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తూ యూనియన్ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అన్ని ప్రధాన పత్రికలు, ఛానెళ్ల రిపోర్టర్లు, సీనియర్ జర్నలిస్టులు భాగస్వాములుగా ఉన్న ఏకైక ప్రతినిధి సంఘం టీయూడబ్ల్యూజే మాత్రమేనని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ మరియు హెల్త్ కార్డులు అందేలా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు.
బాలాపూర్ మండల నూతన కార్యవర్గం*
*అధ్యక్షులు: కె. మహిపాల్ రెడ్డి (ఈనాడు)
*ప్రధాన కార్యదర్శి: ఎస్. జయంత్ (నవతెలంగాణ)
*కోశాధికారి:సి. శ్రావణ్ కుమార్
*ప్రధాన సలహాదారులు: ఆనంతుల శ్రీనివాస్
*సలహాదారులు: ఎం. భుజంగారెడ్డి, ఎండీ నిజాముద్దీన్, భూపాల్, శ్రీనివాస్
*ఉపాధ్యక్షులు: కే. శ్రీనివాస్ గౌడ్, ఎం. అమరేశ్వర్ రెడ్డి, ఆర్. రమేష్
*సంయుక్త కార్యదర్శులు: జి. శ్రీనివాస్, బొల్లంపల్లి రాంబాబు, కే. శ్రావణ్
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మాజీ జిల్లా అధ్యక్షులు ఆనంతుల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి శశిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు పాండు యాదవ్, ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు నర్సింహా, సంయుక్త కార్యదర్శులు దారుగుపల్లి సత్యనారాయణ, బొల్లంపల్లి ఆంజనేయులు, సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సురేందర్, జంగయ్య, శేఖర్, కృష్ణ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో స్థానిక కమిటీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి వివిధ పత్రికల విలేకరులు, యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.


