ఎల్బీనగర్,
సర్ నోటీసుల పంపిణీ నేటి నుండి ప్రారంభం
సరూర్నగర్ సర్కిల్-12 పరిధిలో Special Intensive Revision (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు సర్ నోటీసుల పంపిణీ కార్యక్రమం నేటి నుండి ప్రారంభమవుతున్నట్లు ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఏఈఆర్ఓ & డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత బిఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు నోటీసులు అందజేసి, సర్ ప్రక్రియలో భాగంగా అవసరమైన పత్రాలు, వివరాల సమర్పణ విధానంపై అవగాహన కల్పిస్తారు.కేవలం నోటీసు అందుకున్న ఓటర్లు తమకు వర్తించే పత్రాలను సమర్పించాలి. ముఖ్యంగా:
భారతీయ పౌరసత్వానికి సంబంధించిన పత్రం – పాస్పోర్ట్, జనన ధృవీకరణ పత్రం లేదా వర్తించే ఇతర ప్రభుత్వ పత్రాలు.10వ తరగతి/మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం మొదలగు ఏవైనా ఒకటి లేదా రెండు సంబంధిత పత్రాలు.నోటీసులో పేర్కొన్న పత్రాలను పరిశీలించి, తమకు వర్తించే పత్రాలను మాత్రమే సమర్పించాలని ఓటర్లకు సూచించారు. పత్రాల విషయంలో సందేహాలు ఉంటే సంబంధిత జిహెచ్ఎంసి, రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. సర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు అందజేస్తున్నందున, ఓటర్లు అవసరమైన సహకారం అందించి, సరైన వివరాలు మరియు అవసరమైన పత్రాలను సమయానికి సమర్పించాలని కోరారు.
సర్ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని డిప్యూటీ కమిషనర్ కోరారు.


