Tuesday, September 22, 2026
Google search engine
Homeతెలంగాణరంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సారథిగా పారిజాత నరసింహారెడ్డి: రాష్ట్ర మంత్రులతో కీలక భేటీ

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సారథిగా పారిజాత నరసింహారెడ్డి: రాష్ట్ర మంత్రులతో కీలక భేటీ

జిల్లా సమగ్ర అభివృద్ధి, పార్టీ బలోపేతమే లక్ష్యంగా సంప్రదింపులు.
పూర్తి సహకారం అందిస్తామన్న మంత్రుల బృందం.

హైదరాబాద్:

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన చిగిరింత పారిజాత నరసింహారెడ్డి రాష్ట్ర సచివాలయంలో పలువురు మంత్రులను కలుసుకున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రగతి, రాజకీయ వ్యూహాలపై మంత్రులతో విస్తృతంగా చర్చించారు.

*మంత్రులకు కృతజ్ఞతలు – భవిష్యత్ కార్యాచరణపై చర్చ
రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్, సమాచార సాంకేతికత పరిపాలన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు నివేదించారు.

*అభివృద్ధికి మంత్రుల అభయం
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అధ్యక్షురాలికి మంత్రుల బృందం శుభాకాంక్షలు తెలిపింది. రంగారెడ్డి జిల్లా విస్తరణ, పారిశ్రామిక ప్రగతి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలలో పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.

*పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి
జిల్లా పరిధిలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వార్డు స్థాయి నుంచి కమిటీల పునర్నిర్మాణం వేగవంతం చేయనున్నట్లు నాయకత్వం వెల్లడించింది. ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పరిపాలనా ఫలాలను సామాన్యులకు అందించడమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments