బంజారా హిల్స్:
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ జాతీయ చైర్మన్‌గా నియమితులైన మాజీ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ అధ్యక్షులు మధుయాష్కి గౌడ్‌ను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారా హిల్స్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం ఈ అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది.
*ఘన సత్కారం
ఈ సందర్భంగా రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ అధ్యక్షులు దొంగరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర క్యాబ్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కందుల ఉపేందర్ తదితరులు మధుయాష్కి గౌడ్‌ను పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆయన భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ అభినందన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎండీ హమీద్ పటేల్, ఎల్బీనగర్ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా క్యాబ్ యూనియన్ కార్మికులు మరియు పలువురు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ నియామకం ద్వారా సంస్థకు మరింత వన్నె వస్తుందని, కార్మిక వర్గాలకు మరింత బలమైన ప్రాతినిధ్యం లభిస్తుందని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు.
(ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం లేదా మీ ప్రాంతంలోని ఇతర విశేషాలను మాకు తెలియజేయండి.)



