ఎల్బీనగర్:
చైతన్యపురి గణేష్ ఫంక్షన్ హాల్ వద్ద రంగారెడ్డి వెయిట్ లిఫ్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఖేలో ఇండియా – అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ వెయిట్ లిఫ్టింగ్ లీగ్ కార్యక్రమానికి గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ తాజా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మహిళా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా వారికి అవసరమైన ప్రోత్సాహం, శిక్షణ, మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, ప్రతిభను వెలికితీసేందుకు అనేక అవకాశాలు కల్పిస్తోందన్నారు.మహిళలు అన్ని రంగాలతో పాటు క్రీడా రంగంలోనూ మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు.వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రతిభ కనబరుస్తున్న ప్రతి క్రీడాకారిణికి తన ప్రోత్సాహం, సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి వెయిట్ లిఫ్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారిణులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


