Thursday, October 1, 2026
Google search engine
Homeతెలంగాణసిరిసిల్లలో ప్రగతి శంఖారావం:

సిరిసిల్లలో ప్రగతి శంఖారావం:

రూ.340 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం

రాజన్న సిరిసిల్ల జిల్లా:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి, జిల్లా ప్రజలకు రూ.340 కోట్ల భారీ అభివృద్ధి మరియు సంక్షేమ కానుకలను అందించారు. ఈ పర్యటనలో భాగంగా పలు నూతన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, పూర్తయిన కీలక ప్రాజెక్టులను ఘనంగా ప్రారంభించారు.

నేతన్నల అభ్యున్నతికి ‘నేతన్న బజార్’
చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, వారి ఉత్పత్తులకు సరైన మార్కెట్ వసతి కల్పించడం లక్ష్యంగా సిరిసిల్లలో ప్రతిష్టాత్మకంగా ‘నేతన్న బజార్’ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక చేనేత రంగానికి మహర్దశ పట్టనుంది.

విద్యా రంగానికి పెద్దపీట: ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
భావితరాల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సిరిసిల్ల మరియు వేములవాడ ప్రాంతాలలో రూ.200 కోట్ల వ్యయంతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా, సిరిసిల్ల మరియు కోనరావుపేటలలో నూతనంగా ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల’ ఏర్పాటుకు కూడా అంకురార్పణ చేశారు.

రాజన్న క్షేత్రం అభివృద్ధికి రూ.99.40 కోట్లు:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా రూ.99.40 కోట్ల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

పరిపాలనా సౌలభ్యం కోసం నూతన కార్యాలయాలు
ప్రజలకు ప్రభుత్వ సేవలందింపును మరింత చేరువ చేసేందుకు పాలనా కేంద్రాన్ని బలోపేతం చేశారు.

  • సిరిసిల్ల మరియు వేములవాడలో రెండు నూతన ఆర్డీవో కార్యాలయాలు.
  • తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ గ్రామీణ, రుద్రంగి మండలాలలో నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు.
  • వేములవాడలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.

అన్నదాతలకు భరోసా: రుద్రంగిలో గోదాములు
రైతు సోదరులు పండించిన ధాన్యాన్ని భద్రపరుచుకునేందుకు వీలుగా రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల భారీ నిల్వ సామర్థ్యంతో గోదాములు మరియు అనుబంధ యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

*మహిళా సాధికారతే లక్ష్యంగా ‘ఇందిరా మహిళా శక్తి భవన్’
మహిళల ఆర్థిక స్వాలంబనను సాధికారతను పెంపొందించే దిశగా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఇందిరా మహిళా శక్తి భవన్’ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాలలో రాణించేలా ఈ భవనం వేదికగా నిలువనుంది.

*శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
ప్రజలకు మెరుగైన భద్రతను అందించేందుకు పోలీసు యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేశారు. వేములవాడలో ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు, వేములవాడ మరియు సిరిసిల్ల పట్టణాలలో రెండు నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments