Friday, October 16, 2026
Google search engine
Homeతెలంగాణహైదరాబాద్–రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రులకు సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్–రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రులకు సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు నవంబర్ 6

బాలాపూర్:

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టభద్రుల ఓటరు జాబితాను కొత్తగా రూపొందిస్తున్నందున, గతంలో ఓటరుగా నమోదై ఉన్నవారు సైతం తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు 2026 నవంబర్ 6వ తేదీలోపు ఫారం-18 ద్వారా ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత ఎన్నికల అధికారుల వద్ద ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.సమీపంలోని మీ సేవ కేంద్రం లేదా స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించి, నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని కోరారు.

అర్హత : 2023 అక్టోబర్ 31వ తేదీ నాటికి లేదా అంతకుముందే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత పొందిన వారు, ఇతర నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చు.

చివరి తేదీ: 2026 నవంబర్ 6

పట్టభద్రులందరూ గడువు ముగిసే వరకు వేచి ఉండకుండా ముందుగానే తమ దరఖాస్తులను సమర్పించి, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments