Friday, October 16, 2026
Google search engine
Homeతెలంగాణకాప్రా చెరువు అవుట్లెట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్

కాప్రా చెరువు అవుట్లెట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్

ఎల్బీనగర్

ఎల్బీనగర్ నియోజకవర్గం బిఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని హరిహరపురం కాలనీలోని కాప్రా చెరువు అవుట్లెట్ పనుల నిమిత్తం గతంలో ఐదు కోట్ల రూపాయలు మంజూరు అయింది. ఈ పనులు కుమ్మరికుంట నుంచి మిలేనియం కాలనీ వరకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మిలేనియం కాలనీ నుంచి కాప్రా చెరువు వరకు దాదాపు ఇంకొక ఏడు కోట్ల రూపాయలతో పనులు మంజూరు దశలో ఉన్నాయి. పనుల నిమిత్తం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జోనల్ కమిషనర్ వికాస్ మహాతోతో కలిసి కాప్రా చెరువు పరిసరాల్లో పర్యటించి ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని సుధీర్ రెడ్డి జోనల్ కమిషనర్ ను కోరడమైనది.ఈ కాప్రా చెరువు అవుట్లెట్ నిర్మాణ పనులు పూర్తయితే దిగువన ఉన్న శాతవాహన నగర్, సాయి గార్డెన్, గాంధీ నగర్, గాంధీ నగర్ సౌత్, స్నేహమయి నగర్, అఖిలాండేశ్వరి నగర్, పివీఆర్ కాలనీ, సామా నగర్ ఇతర కాలనీలు వరద ముంపు నుండి తప్పించుకుంటాయి.వచ్చే వర్షాకాలం లోపు పనులు పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ ను ఎమ్మెల్యే కోరారు. అనంతరం జోనల్ కమిషనర్ మాట్లాడుతూ, ఇప్పటికే ప్రతిపాదన పంపడం జరిగిందని అతి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ భారాస పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద రెడ్డి,అనిల్ చౌదరి, రాఘవేంద్రరావు,పోగుల రాంబాబు,సందీప్ పలు కాలనీల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments