ఎల్బీనగర్
ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హెచ్ఎండబ్ల్యుఎస్ సివరేజ్ బోర్డ్ మల్కాజిగిరి ఈడి శ్రీమతి.పంకజను ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ కాలనీలలో పెండింగ్లో ఉన్న యూజీడీ (అండర్గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు పరిపాలనా అనుమతులు,నిధుల మంజూరు కోరుతూ వారిని కలిశారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలలో నూతన, పెండింగ్ డ్రైనేజ్ పనులు మంజూరు చేయాలని కోరారు.దాన్లో భాగంగా బైరామల్ గూడా లోని గోకుల్ ఎంక్లేవ్, హయత్ నగర్ డివిజన్ పరిధిలోని సిరిహిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్,శ్రీ గాయత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, దత్తాత్రేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, కుంట్లూర్ రోడ్డులోని బెల్లయాదవ్ నగర్ కాలనీ,బాగ్ హయత్ నగర్ లోని సాయిరాం నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ వినాయక నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, హస్తినాపురం డివిజన్ పరిధిలోని డైమండ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, సుల్తాన్ వాల్వ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్,శ్రీ వెంకటేశ్వర కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వెంకటేశ్వర కాలనీ పేస్ 2,హస్తినాపురం రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్,ఖాద్రి కాలనీ,మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని సి.ఎస్.ఆర్.కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్,సిఆర్ఎ ఎనక్లేవ్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్,జడ్జెస్ కాలనీ ఫేస్1,శ్రీరామ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, బిఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని బి.యన్.రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీపురం డెవలప్మెంట్ అసోసియేషన్, చైతన్యపురి డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, వనస్థలిపురం డివిజన్ పరిధిలోని శారద నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కొత్తపేట్ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, సత్య నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, రాజీవ్ గాంధీ కాలనీ,నాగోల్ డివిజన్ పరిధిలోని ఆప్కో కాలనీ రెసిడెన్సి వెల్ఫేర్ అసోసియేషన్,గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని తిరుమల నగర్ కాలనీలో డ్రైనేజీ పనులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం పంకజ మాట్లాడుతూ, సుధీర్ రెడ్డి ఇచ్చిన నివేదిక ప్రకారం కొన్ని పనులు ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందని, అలాగే ప్రధాన సమస్యలు ఉన్న కాలనీలలో డ్రైనేజ్ పనులు పూర్తిచేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే పూర్తి కానీ మిగతా పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు.


