Friday, October 23, 2026
Google search engine
Homeతెలంగాణవరద నీటి కాల్వ పనుల పరిశీలన....రూ. 4 కోట్లతో కుడికుంట చెరువు అలుగు, వరదనీటి కాల్వ...

వరద నీటి కాల్వ పనుల పరిశీలన….రూ. 4 కోట్లతో కుడికుంట చెరువు అలుగు, వరదనీటి కాల్వ నిర్మాణం….

శేరిలింగంపల్లి :శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లోని కుడికుంట చెరువు అలుగు నుండి మసీదు బండ ప్రభుపాద లే ఔట్ కాలనీ వరకు రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయంతో జరుగుతున్న వరద నీటి కాల్వ నిర్మాణం పనులను పిఎసి చైర్మన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసీదు బండ లోని ప్రభు పాద లే ఔట్ కాలనీ లో నెలకొన్న వరద నీటి కాల్వ ఔట్ లెట్ సమస్య కు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని, సుమారుగా 4 కోట్ల రూపాయలతో వరద నీటి కాల్వ నిర్మాణం పనులు చేపడుతున్నామని, ప్రజల ఇబ్బందులను, వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియచేశారు. వరద నీటి కాల్వ ఔట్ లెట్ సరిగ్గా లేక వరద నీరు చేరి కాలనీ ముంపుకు గురి అవుతుంది అని ప్రజలు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అన్ని రకాల చర్యలుంను తీసుకోవాలని, పక్కా ప్రణాళికలు వేసుకొని పనులు ప్రారంభించాలని, ప్రతిపాదనలు సిద్ధం చేసి యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులకు తెలియచేశారు.

కుడి కుంట చెరువు ఔట్ లెట్ నుండి నీటి ప్రవాహం అధిక మొత్తంలో వస్తుంది కావున చెరువు ఔట్ లెట్ ను పరిగణలోకి తీసుకోవాలని, మళ్ళీ వరద ముంపు సమస్య పునరావృతం కాకుండా వరద నీటి కాల్వ నిర్మాణం చేపట్టాలని, వరద నీటి కాల్వ నిర్మాణం పనుల పై అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగినదన్నారు.

అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, వరద నీటి కాల్వ నిర్మాణం పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడానికి శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించడం జరిగినదన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, శేరిలింగంపల్లి డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments