Wednesday, July 30, 2025
Google search engine
Homeనేషనల్ఈ దీపావళి ఎంతో గొప్పది అన్న నరేంద్ర మోడీ..

ఈ దీపావళి ఎంతో గొప్పది అన్న నరేంద్ర మోడీ..

9 వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రసంగం..
ధన్వంతరి జయంతిని గుర్తు చేసిన ప్రధాని
ప్రధానిని ఘనంగా సత్కరించిన కేంద్ర మంత్రులు..

ఈ దీపావళి చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేదలో రూ.12,850కోట్ల విలువైన పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానిని కేంద్రమంత్రులు జేపీ నడ్డా, మన్సుఖ్‌ మాండవీయ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు దేశం ధన్‌తేరస్‌ పండుగ, ధన్వంతరి జయంతి వేడుకలు జరుపుకుంటుందన్నారు. ధన త్రయోదశి, భగవాన్ ధన్వంతరి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సమయంలో ప్రజలంతా తమ ఇంటికి కావాల్సిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారన్నారు.

దేశంలోని వ్యాపారవేత్తలకు నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ దీపావళి చారిత్రాత్మకమన్న ఆయన.. దాదాపు 500 ఏళ్ల తర్వాత మళ్లీ మరో అద్భుతమైన సందర్భం వచ్చిందన్నారు. అయోధ్యలోని రామ్‌లల్లా జన్మస్థలంలో నిర్మించిన ఆలయంలోనూ వేలాది దీపాలను వెగిలించనున్నట్లు పేర్కొన్నారు. ఇదో అద్భుత వేడుకగా నిలువనుందన్నారు. 500 ఏళ్ల తర్వాత ఈసారి ఈ నిరీక్షణ ఫలించిందన్నారు. ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం పట్ల ఆకర్షితులవుతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments