శేరిలింగంపల్లి
ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు పొందిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను గురువారం సైబరాబాద్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన పండుగ సాయన్న ముదిరాజ్ ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని సైబరాబాద్ పోలీసు అధికారులు పేర్కొన్నారు.ఆయన స్వేచ్ఛ సమానత్వం కోసం చేసిన పోరాటాలను, సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా. యం. రమేష్, డీసీపీ (అడ్మిన్) అన్నపూర్ణ, డీసీపీ (సీఏఆర్) సంజీవ్, ఏఏఓ, ఏఓతో పాటు మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


