Thursday, October 29, 2026
Google search engine
Homeతెలంగాణపంచ పరివర్తనతో సమాజంలో సానుకూల మార్పులు

పంచ పరివర్తనతో సమాజంలో సానుకూల మార్పులు

-నైతిక విలువలు, సంస్కారం, బాధ్యతాయుత పౌరసత్వంతోనే బలమైన దేశ నిర్మాణం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్

పంచ పరివర్తనలోని ఐదు సూత్రాలైన సామాజిక సామరస్యం, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, స్వబోధ, పౌర కర్తవ్యాలు సమాజంలో సానుకూల మార్పులకు పునాది వేస్తాయని తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. విద్య అనేది కేవలం జ్ఞానాన్ని, ఉపాధిని అందించే సాధనం మాత్రమే కాదని, నైతిక విలువలు, సంస్కారం, క్రమశిక్షణ, మానవత్వం, బాధ్యతాయుత పౌరసత్వాన్ని పెంపొందిస్తూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలు, దేశం పట్ల బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలనే స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన ‘పంచ పరివర్తన’ పుస్తకాన్ని గవర్నర్ బుధవారం సాయంత్రం లోక్ భవన్ కమ్యూనిటీ హాల్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ జ్ఞాన సంప్రదాయం విద్యను వ్యక్తిత్వ వికాసానికి, జీవిత నిర్మాణానికి పునాదిగా భావించిందని పేర్కొన్నారు. జ్ఞానంతో పాటు మానవత్వం, ఆధునికతతో పాటు సంస్కారం కలిగిన పౌరులను తీర్చిదిద్దడమే విద్య యొక్క అసలైన లక్ష్యమని స్పష్టం చేశారు.

సామాజిక సామరస్యం ద్వారా పరస్పర గౌరవం, ఐక్యతను బలోపేతం చేయాలని, కుటుంబ విలువల ద్వారా పిల్లల్లో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందించాలని గవర్నర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించుకుంటూనే ఆధునిక విజ్ఞానాన్ని స్వీకరించాలని అన్నారు. హక్కులతో పాటు పౌర కర్తవ్యాలను కూడా నిజాయితీగా నిర్వర్తించినప్పుడే సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

పంచ పరివర్తన సూత్రాలను ఆచరణలోకి తీసుకురావడంలో కుటుంబాలు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం సమన్వయంతో కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడి భాగస్వామ్యంతోనే విలువలతో కూడిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, పంచ పరివర్తన భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments