ఎల్బీనగర్
హైదరాబాద్ -రంగారెడ్డి -మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. గడ్డిఅన్నారం, హయత్ నగర్ డివిజన్ల పరిధిలోని పి అండ్ టీ కాలనీ చౌరస్తా, రంగనాయకుల గుట్టలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి, భవాని ప్రవీణ్ కుమార్ సీనియర్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వరరావు, చెరుకు శ్రీధర్ గౌడ్, రమేష్ ముదిరాజ్,శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



