Tuesday, November 3, 2026
Google search engine
Homeతెలంగాణపోలీసు సిబ్బంది సంక్షేమానికి, సమర్థతకు మౌలిక వసతులు కీలకం

పోలీసు సిబ్బంది సంక్షేమానికి, సమర్థతకు మౌలిక వసతులు కీలకం

  • కొత్త క్వార్టర్స్‌, గ్యాస్‌ గోదాం ప్రారంభించిన డిజి మహేశ్‌ భగవత్‌
  • వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

హైదరాబాద్‌

పోలీసు శాఖ సమర్థంగా పనిచేయడానికి ఆధునిక మౌలిక వసతులు ఎంతో అవసరమని డిజి (లా & ఆర్డర్‌) మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన నివాస, కార్యాలయ సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటని పేర్కొన్నారు.

యూసుఫ్‌గూడలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు (టీజీఎస్పీ) మొదటి బెటాలియన్‌లో నూతనంగా నిర్మించిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ క్వార్టర్స్‌, ఆధునికీకరించిన గ్యాస్‌ గోదాంను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బెటాలియన్‌లోని వివిధ అంతస్తులు, కల్పించిన మౌలిక వసతులను టీజీఎస్పీ బెటాలియన్ల ఎడిజి సంజయ్‌కుమార్‌ జైన్‌ వివరించారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన చిన్నారులకు డిజి మహేశ్‌ భగవత్‌ బహుమతులు అందజేసి విద్యార్థులను అభినందించారు.

కార్యక్రమంలో బెటాలియన్ల డిఐజి మురళీకృష్ణ, మొదటి బెటాలియన్‌ కమాండెంట్‌ కె.వీరయ్య, ఎనిమిదో బెటాలియన్‌ కమాండెంట్‌ శివప్రసాద్‌రెడ్డి, అదనపు కమాండెంట్‌ కె.పి.శరత్‌కుమార్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments