Thursday, November 5, 2026
Google search engine
Homeతెలంగాణవాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణ హర్షణీయం

వాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణ హర్షణీయం

  • సమస్య పరిష్కరించినందుకు హైడ్రాకు అభినందనలు
  • హైడ్రా కమిషనర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన హాస్టళ్ల నిర్వాహకులు

హైదరాబాద్‌:

హైదరాబాద్‌లో నీటి ట్యాంకర్ల యజమానులు సమ్మె విరమించడం పట్ల హాస్టళ్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకర్ల యజమానులతో వెంటనే మాట్లాడి సమస్యను పరిష్కరించినందుకు గాను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం హాస్టళ్ల నిర్వాహకుల సంఘం ప్రతినిధులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలిసారు. హాస్టళ్లకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సమస్య పరిష్కారానికి చొరవ చూపిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కి హాస్టళ్ల యజమానుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. జీవనోపాధి, విద్య, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తున్నారని, నగరంలోని హాస్టళ్లలో వేలాది మంది ఉంటూ నీటి అవసరాల కోసం ట్యాంకర్ల సరఫరాపై ఆధారపడుతున్నారని వారు పేర్కొన్నారు. నీటి ట్యాంకర్ల సమ్మె కొనసాగితే హాస్టళ్లలో ఉంటున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్యాంకర్ల యజమానులతో చర్చించి… నగరంలోని జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగకుండా, తక్కువ జనసాంద్రత కలిగిన PURE (Peri Urban Region) ప్రాంతాల నుంచి నీటిని సేకరించి వ్యాపార కార్యకలాపాలు సాగించాలని ఎంతో దూర దృష్టితో హైడ్రా కమిషనర్ ఏ.వీ రంగనాథ్ సూచించిన విషయాన్ని వాటర్ ట్యాంకర్ల యజమానులు దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఈ సూచనతో ట్యాంకర్ల యజమానులు సమ్మె విరమించి నీటి సరఫరాలను పునరుద్ధరించేందుకు అంగీకరించడం హర్షణీయమని హాస్టళ్ల యజమానుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులకు నీటి సరఫరా సమస్య తలెత్తకుండా పరిష్కార మార్గం చూపినందుకు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments