Thursday, November 5, 2026
Google search engine
Homeతెలంగాణముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సున్నం చెరువు, తమ్మిడికుంట చెరువుల వద్ద ఏర్పాట్లను పరిశీలించి, సమీక్షించిన సైబరాబాద్...

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సున్నం చెరువు, తమ్మిడికుంట చెరువుల వద్ద ఏర్పాట్లను పరిశీలించి, సమీక్షించిన సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డా. ఎం. రమేష్

శేరిలింగంపల్లి :

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదిత పర్యటన నేపథ్యంలో, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నం చెరువు మరియు తమ్మిడికుంట చెరువులను స్వయంగా సందర్శించి పరిశీలించారు.

ఈ పర్యటనలో కూకట్‌పల్లి జోన్ డి.సి.పి. రితిరాజ్, ఐ.పి.ఎస్, మాదాపూర్ డివిజన్ ఎసిపి. సిహెచ్. శ్రీధర్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, పి. రమేష్ మరియు ఇతర ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలను పరిశీలించిన ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ మరియు ఇతర అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని శాఖల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూసుకోవాలని, ముఖ్యమంత్రి పర్యటన సజావుగా మరియు సురక్షితంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత పోలీసు సిబ్బందికి మరియు అధికారులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ తగిన ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments