Home ఇంటర్నేషనల్ ఇప్పుడు గెలిచినా.. వచ్చే ఏడాదే ప్రమాణ స్వీకారం..!

ఇప్పుడు గెలిచినా.. వచ్చే ఏడాదే ప్రమాణ స్వీకారం..!

0
57
The rush of presidential elections in America.. Nearly six million Americans voted early. Many people voted through mail ballot.
The rush of presidential elections in America.. Nearly six million Americans voted early. Many people voted through mail ballot.

అమెరికాలో అధ్యక్షా ఎన్నికల హడావుడి..
దాదాపు ఆరుకోట్ల మంది అమెరికన్స్ ముందస్తు ఓటింగ్..

మెయిల్ బ్యాలెట్ ద్వారా పలువురి ఓటింగ్..
ఓటుహక్కు వినియోగించుకున్న జో బైడన్
బరిలో కమలా హ్యారిస్, ట్రంప్..

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైంది. నవంబర్‌ 5 ఎన్నికల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాన పోలింగ్‌కు ముందు ముందస్తు ఓటింగ్‌ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటి వరకూ దాదాపు ఆరు కోట్ల మంది అమెరికన్లు ముందస్తు ఓటింగ్‌ ప్రక్రియ ద్వారా ఓటేసినట్లు తెలిసింది.

ఇందులో కొందరు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయగా.. మరికొందరు మెయిల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఇటీవలే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో గత ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. దాదాపు 40 నిమిషాల పాటు క్యూలో నిల్చొని ఓటు వేసినట్లు యూఎస్‌ మీడియా తెలిపింది.

కమలా హారిస్‌ Vs ట్రంప్‌.. గెలుపెవరిదో..?

కాగా, యూఎస్‌ అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న జరగనున్నాయి. డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలోకి దిగారు. ఇరువురూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలుపే లక్ష్యంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకూ వెలవడిన ఎన్నికల సర్వేల్లో కమలా హారిస్‌ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

అయితే, ముఖ్య రాష్ట్రాలైన జార్జియా, నార్త్ కరోలినాలో హారిస్‌, ట్రంప్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజా సర్వే ప్రకారం, జార్జియాలో ట్రంప్‌కు 48 శాతం, హారిస్‌కు 47 శాతం మద్దతు ఉంది. ఇక, నార్త్ కరోలినాలో హారిస్‌కు 48 శాతం, ట్రంప్‌కు 47 శాతం మద్దతు లభించింది. 2008లో డెమోక్రటిక్ అభ్యర్థి ఒబామాకు మద్దతు తెలిపిన నార్త్ కరోలినా, ఆ తరువాత రిపబ్లికన్ అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతోంది. జార్జియాలోనూ గత ఎన్నికలలో గట్టి పోటీ ఉండగా, చివరకు 2020లో బైడెన్ కేవలం 1 శాతం మెజారిటీతో గెలిచిన విషయం గమనార్హం.

ఇక నవంబర్‌ 5న ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వచ్చే ఏడాది జనవరిలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయం సాధించిన 11 వారాల తర్వాతే వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే, తొలుత నవంబర్‌లో ఎన్నికైన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం మార్చి 4వ తేదీన జరిగేది. ఇందు కోసం దాదాపు నాలుగు నెలల సమయం పట్టేది. అమెరికాలో ‘గ్రేట్‌ డిప్రెషన్‌’ సందర్భంగా ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నిక నుంచి ప్రమాణ స్వీకారానికి మధ్యలో ఉన్న గ్యాప్‌ను మూడు నెలలకు కుదించారు. ఇందుకోసం 1933లో సవరణను తీసుకొచ్చారు. దాని ప్రకారం నవంబర్‌లో ఎన్నికైన అధ్యక్షుడు జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here