Wednesday, November 18, 2026
Google search engine
Homeతెలంగాణతెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సందేహాలు - అవగాహన సదస్సు

తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సందేహాలు – అవగాహన సదస్సు

ఎల్బీనగర్ :

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడం కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను త్వరలో చేపట్టనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే – జేఏసీ అనుబంధ ఎల్బీనగర్ జర్నలిస్టుల కోసం టీయూడబ్ల్యూజే – జేఏసీ ఎల్బీనగర్ జర్నలిస్టుల బృందం ఆధ్వర్యంలో మంగళవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ సాయి గార్డెన్స్‌లో నిర్వహించిన ‘తెలంగాణ ఉద్యమం – జర్నలిస్టుల సందేహాలు – అవగాహన’ కార్యక్రమానికి మాజీ సభ్యుడు మోతె శోభన్‌ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల ఉద్యమకారులకు న్యాయం చేయడం కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు ఉద్యమంలో పాల్గొన్న అంశాలకు సంబంధించి ఎలాంటి వివరాలు నమోదు చేయాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు.ఉద్యమ కేసులు ఉన్న వారు, ఉద్యమ చరిత్ర ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. అందరి భాగస్వామ్యాన్ని గుర్తించి వారికి గౌరవం, సత్కారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో జర్నలిస్టుల చూపిన చొరవ అసామాన్యమైనదన్నారు. ఉద్యమ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టుల పోరాటాన్ని చూస్తూ రాజకీయాల్లో ముందడుగు వేశామన్నారు. వారికి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఉద్యమ జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం 420 హామీల మాదిరి జర్నలిస్టులకు ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కవద్దని హితవు పలికారు.ఉద్యమ నాయకునిగా ప్రొఫెసర్ కోదండరామ్ ఉద్యమ జర్నలిస్టుల ఎంపికను త్వరగా పూర్తి చేసి, వారికి న్యాయం చేయాలని విన్నవించారు. టీయూడబ్ల్యూజే-జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ, ఉద్యమ జర్నలిస్టులను గుర్తించి, గౌరవం ఇవ్వాలని కోరారు. ఇతర వృత్తులతో పోల్చితే మానసిక ఒత్తిడితో కూడిన వృత్తిని ఎంచుకున్న మా జర్నలిస్టు సోదరులకు గొంతెమ్మ కోర్కెలు లేవని, అర్హులను గుర్తించి దక్కాల్సిన గౌరవం కల్పిస్తే చాలన్నారు. కో-ఆర్డినేషన్ కమిటీ వేసి ఉద్యమ జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.ప్రస్తుతం జర్నలిస్టులకు ఇస్తున్న రూ. 3 వేల పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విన్నవించారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న జర్నలిస్టులకు ఇస్తున్నటువంటి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని రెండు లక్షలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ 9వ తేదీన జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు, ఇంటి స్థలాల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ మలిదశ పోరాటంలో ఎల్బీనగర్ జర్నలిస్టులు ఎంతో కీలకంగా వ్యవహరించారన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమానికి ఊపిరి పోసిన ఉద్యమకారులలో ఎల్బీనగర్ జర్నలిస్టులు ముందు వరుసలో ఉంటారని ఆయన వేర్కొన్నారు. అలాంటి ఎల్బీనగర్ జర్నలిస్టులందరికీ తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు
టీయూడబ్ల్యూజే-జేఏసీ రాష్ట్ర నాయకులు జాల రాధా కిషన్ సభాధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్‌ రెడ్డి, ఉప ప్రధాన కార్యదర్శి రాములు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండి సలీం పాషా, కార్యదర్శి మేకల సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యులు టి.ప్రవీణ్‌ కుమార్, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి పిండిగి వెంకన్న, తెలంగాణ ఉద్యమ జేఏసీ ఎల్బీనగర్ తొలి చైర్మన్ చామకూర రాజు, రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహ మొగిలి, మధు, జాయింట్ సెక్రటరీ బొల్లంపల్లి ఆంజనేయులు, కోశాధికారి శశిపాల్‌ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆవంచ సురేందర్, శ్యాం ప్రసాద్, దర్శనం జంగయ్య, బెల్లి మల్లేష్‌యాదవ్, సీనియర్ నాయకులు వర్రెల్లి దశరథ్, సోలిపురం రజనీకాంత్‌ రెడ్డి, రచ్చ శేఖర్, బద్దుల శ్రీధర్, బద్దుల మల్లేష్‌ యాదవ్, దుగ్గు రము, గుండపల్లి అరవింద్, బాలాపూర్ మండల ప్రెసిడెంట్ అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జయంత్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు జగన్, మలక్ పేట్ జర్నలిస్టులు రవీందర్‌ రెడ్డి, హన్స్‌రాజ్, రవి, సాగర్, ముత్యాలు, చప్పల శ్రీనివాస్, వార్త శ్రీనివాస్, గిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments