ఎల్బీనగర్
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో జీహెచ్ఎంసీ నిధులతో మంజూరైన పలు అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో, సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో డీఈ విజయ్, ఏఈ మౌనికని కలిసి వివిధ కాలనీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను చర్చించారు. గతంలో మంజూరైన పనులు ఇంతకాలం గడిచినా ఎందుకు ప్రారంభం కాలేదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల ప్రారంభానికి ఉన్న అడ్డంకులను తొలగించి, వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పనులు చేపట్టాలని కోరారు.ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గడ్డి అన్నారం కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో డివిజన్లోని ప్రతి కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి, ప్రజల విజ్ఞప్తుల మేరకు పలు అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేశామని తెలిపారు. అయితే మంజూరైన పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం వల్ల ఆయా కాలనీల ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి అనేది కేవలం ప్రతిపాదనలకు, శంకుస్థాపనలకు పరిమితం కాకూడదని, మంజూరైన నిధులతో పనులు ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసినప్పుడే ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, కమ్యూనిటీ భవనాల అభివృద్ధి వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని అధికారులను కోరారు.
దీనిపై డీఈ విజయ్, ఏఈ మౌనిక సానుకూలంగా స్పందిస్తూ, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నీ తమ దృష్టిలో ఉన్నాయని, సంబంధిత ప్రక్రియలను పూర్తి చేసి రానున్న రోజుల్లో వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడమే తన బాధ్యత అని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.


