Thursday, November 19, 2026
Google search engine
Homeతెలంగాణబెదిరింపులతో డబ్బుల వసూలు.. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్

బెదిరింపులతో డబ్బుల వసూలు.. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్

రూ.20 వేల డిమాండ్.. భయపడి రూ.4 వేలు చెల్లించిన బాధితులు

ఎల్బీనగర్

శుభకార్యాలు, వివాహ వేడుకల సమయంలో బెదిరింపులకు పాల్పడుతూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం సమయంలో కొత్తపేటలోని ఓ ఇంట్లో వివాహ బరాత్ జరుగుతుండగా ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు అక్కడికి చేరుకున్నారు. ఇంటి వద్దకు వచ్చి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మరికొందరిని పిలిపించి గేటు వద్ద న్యూసెన్స్ , అలజడి సృష్టిస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితులు వారికి రూ.4 వేలు చెల్లించారు.
అనంతరం బాధితులు డయల్-112కు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం న్యాయ స్థానంలో హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ కె. సైదులు మాట్లాడుతూ, వివాహ వేడుకలు, శుభకార్యాలు, దుకాణాల ప్రారంభోత్సవాల సమయంలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడుతూ బలవంతంగా డబ్బులు డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా వెంటనే డయల్-112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.గతంలో ఇలాంటి వేధింపులకు గురైన వారు సైతం చైతన్యపురి పోలీసులను సంప్రదించవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సైదులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments