శేరిలింగంపల్లి
చందానగర్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్, రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సెలక్షన్స్ – 2026 పోస్టర్ ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. చందానగర్ లోని పి.జె.ఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నవంబర్ 22న సెలక్షన్స్
రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ సెలక్షన్స్ ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు చందానగర్ లోని పి.జె.ఆర్ స్టేడియంలో జరగనునయన్నారు. 30+ నుండి 80+ వయస్సు గల పురుషులు, మహిళలు ఇందులో పాల్గొనవచ్చు.
ఈ సెలక్షన్స్ లో పరుగు, జంప్స్, త్రోస్, వాక్ వంటి విభాగాలలో పోటీలు నిర్వహించనున్నారు. సెలక్షన్స్ అనంతరం సన్మాన కార్యక్రమం మరియు భోజనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
పోస్టర్ ఆవిష్కరణ అనంతరం హోప్ ఫౌండేషన్ చైర్మన్, జిల్లా అధ్యక్షులు, కొండా విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి స్వాతి గౌడ్, సురేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులు చిరంజీవులు, సంయుక్త కార్యదర్శిలు సుల్తానా, నిరూప్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రంగ రావు, శ్వేత, సుస్మిత రెడ్డి, తదితరులు పాల్గొని పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ… వయస్సుతో సంబంధం లేకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సెలక్షన్స్ లో పాల్గొనాలని, ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలే ఉత్తమ మార్గమని అన్నారు. రంగారెడ్డి జిల్లా నుండి ఎక్కువ మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఎంట్రీల కోసం సంప్రదించండి: 9394868993, 9032748446
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, కోచ్ లు, క్రీడాకారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.


