Monday, June 23, 2025
Google search engine
Homeలైఫ్ స్టైల్దేశమంతా విస్తరించిన ఫ్లా షూట్..

దేశమంతా విస్తరించిన ఫ్లా షూట్..

ఎలాంటి సందర్భమైన ఫ్లా షూట్ బుక్ చేసుకోవచ్చు..
పెద్ద ఖర్చుకూడా ఏమీ కాదు..
వెంటనే ఫ్లా షూట్ డౌన్ లోడ్ చేసుకోండి దండిగా సంపాదించుకోండి..

ఫ్లాషూట్‌తో 250 మంది వీడియోగ్రాఫర్లు చేతులు కలిపారు. వాళ్లకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్‌లో శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లో మొదలైన ఈ సేవలు వైజాగ్‌, వరంగల్‌, కరీంనగర్‌కూ విస్తరించాయి. చెన్నై, బెంగళూరు నగరాల్లోని వీడియోగ్రాఫర్లకు శిక్షణ ఇస్తున్నారు. త్వరలో అక్కడ కూడా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. వీడియోగ్రాఫర్లను పెద్ద పెద్ద ఫంక్షన్ల కోసమే కాదు నలుగురు స్నేహితులు కలుసుకున్నా, ఆలయానికి వెళ్లినా, గెట్‌ టుగెదర్‌ మీట్‌ అయినా ఫ్లాషూట్‌తో బుక్‌ చేసుకోవచ్చు. పెద్దగా ఖర్చు కూడా కాదు.

‘ఈ ఫోనేమన్నా బువ్వ పెడుతుందా?’ అని ఇంట్లో వాళ్లు నిలదీస్తున్నారా? ‘ఇన్‌స్టా రీల్స్‌ చేయడం, రీల్స్‌ చూడటం తప్ప పైసా సంపాదించే పనే లేద’ని పెద్దలు తిడుతున్నారా? ఇష్టమైన పని దొరక్క, కష్టమైన బతుకులో కాస్త రిలీఫ్‌ కోసం రీల్స్‌ చేస్తుంటే ఇన్ని మాటలంటారా అని కుదేలవుతున్నారా! చలో.. ‘ఫోనే ప్రపంచం. రీల్సే జీవితం’ అనుకుంటూ వచ్చిన స్కిల్‌తో నచ్చిన రీల్సే చేసుకుంటూ బతికేయండి. రీల్స్‌ చేస్తే బతుకుదెరువు ఎలా అనుకోకండి. ప్లే స్టోర్‌లో ఫ్లాషూట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారంటే షార్ట్‌ వీడియో అవసరమైన వాళ్లకు సాయం చేస్తూ దండిగా సంపాదించొచ్చు. ఐడియా అదిరింది కదూ!

వశిష్ట్‌ చేతిలో ఎప్పుడూ స్మార్ట్‌ఫోనే. ఏం చేస్తాడు పాపం.. జాబ్‌లెస్‌ లైఫ్‌. నిరుద్యోగికి, చిరుద్యోగికి ఎప్పుడూ తోడుండేది స్మార్ట్‌ఫోనే. ఎక్కడికి పోయినా అక్కడో రీల్‌ చేసి రోజులు గడిపేస్తాడు. అవసరమైన వాళ్లు అడిగితే ఫోన్‌తో వీడియో చేసి పెడతాడు. వీడియో ఎడిటింగ్‌ కూడా బాగా చేస్తాడు. ఇంతకంటే చేసే పనేమీ లేదని అందరూ అనుకుంటారు. ఇలా రీల్స్‌తో టైమ్‌పాస్‌ చేస్తూ ఉండే వశిష్ట్‌ లాంటి వాళ్లు ఇంటికి ఒకరైనా ఉంటారు. ఇంత టాలెంట్‌ని వేస్ట్‌ చేసుకుంటే ఎట్లా? వాళ్లనీ పనిలోపెట్టి ప్రయోజకుల్ని చేయాలనుకున్నాడు కార్తిక్‌ ఓలేటి. ఏదో సమాజాన్ని ఉద్ధరించాలని ఆయన కంకణం కట్టుకోలేదు. తనకు వచ్చిన చిన్న సమస్యకు పరిష్కారం వెతుకుతుంటే ఆయనకో పెద్ద స్టార్టప్‌ కాన్సెప్ట్‌ దొరికింది. ఆ ఐడియాకు తగ్గట్టే ఇద్దరు మంచి మిత్రులు తోడయ్యారు. ముగ్గురూ కలిసి ముచ్చటగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.

ఫ్లాషూట్‌ ని డౌన్‌లోడ్‌ చేసుకుని వీడియోగ్రాఫర్‌ని బుక్‌ చేసుకుంటే దగ్గర్లో (5 కిలోమీటర్ల దూరంలో) ఉన్న వీడియోగ్రాఫర్‌కి కనెక్ట్‌ అవుతుంది. అతను బుక్‌ చేసుకున్న సమయానికి వచ్చి వీడియోలు, ఫొటోలు తీస్తాడు. వీడియోని ఎడిట్‌ చేసి 30 సెకన్ల నుంచి నిమిషం నిడివిలో ఔట్‌పుట్‌ ఇస్తాడు. ఇన్‌స్టా రీల్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌లో దీనిని వెంటనే అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. గంట సమయం ఫొటోగ్రాఫర్‌ని బుక్‌ చేసుకున్నందుకు ఫిక్స్‌డ్‌ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. బేరమాడే బాధ లేదు. అదనపు సమయం చేయించుకుంటే దానికి ఎక్స్‌ట్రా చార్జ్‌ చేస్తారు. హై ఎండ్‌ కెమెరా ఉన్న మొబైల్‌ ఫోన్‌తో వీడియో తీసి, ఎడిట్‌ చేసి రీల్స్‌ని ఇస్తారు. వ్యాపారులు కూడా కమర్షియల్‌ అవసరాల కోసం ఈ కెమెరామెన్లను బుక్‌ చేసుకోవచ్చు. ఫంక్షన్లు, పేరంటాల్లో మహిళలకు అసౌకర్యం లేకుండా కెమెరా ఉమెన్‌ని కూడా బుక్‌ చేసుకోవచ్చు. అయితే రాత్రి తొమ్మిది గంటల తర్వాత జరిగే ఈవెంట్స్‌కు కెమెరా ఉమెన్స్‌ను బుక్‌ చేసుకోవడం కుదరదు. ఎందుకు ఆలస్యం. రెడీమేడ్‌ రీల్స్‌కి పోజులివ్వడానికి సిద్ధమవ్వండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments