Home స్పోర్ట్స్ నాలుగో భార‌తీయుడిగా రికార్డు సృష్టించిన బోపన్న..

నాలుగో భార‌తీయుడిగా రికార్డు సృష్టించిన బోపన్న..

0
63
Entry into ATP Finals.. At the end of this year.. Bopanna is determined to win the title.
Entry into ATP Finals.. At the end of this year.. Bopanna is determined to win the title.

ఏటీపీ ఫైన‌ల్స్‌లో కి ప్రవేశం..
ఈ ఏడాది ఆఖర్లో బరిలోకి..
టైటిల్ సాధించాలనే పట్టుదలతో బోపన్న..

భార‌త స్టార్ టెన్నిస్ ఆట‌గాడు రోహ‌న్ బోపన్న‌మ‌రో ఘ‌త‌న సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ విజేత‌గా నిలిచిన బోప‌న్న ఏటీపీ ఫైన‌ల్స్‌కు అర్హ‌త సాధించాడు. దాంతో, ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క టోర్నీలో ఆడ‌నున్న నాలుగో భార‌తీయుడిగా బోప‌న్న రికార్డు సృష్టించ‌నున్నాడు. డ‌బుల్స్ భాగ‌స్వామి మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో క‌లిసి బోప‌న్న ఈ ఏడాది ఆఖ‌ర్లో ఏటీపీ ఫైన‌ల్స్ బ‌రిలోకి దిగ‌నున్నాడు.

రోలెక్స్ పారిస్ మాస్ట‌ర్స్ టోర్నీ నుంచి నాథ‌నీల్ లామ్మ‌న్స్, జాక్స‌న్ విత్రోల జోడీ నిష్క్ర‌మించడంతో బోప‌న్న ద్వయానికి అవ‌కాశం వ‌చ్చింది. నిరుడు ఏటీపీ ఫైన‌ల్స్‌ సెమీఫైన‌ల్లోనే ఇంటిదారి ప‌ట్టిన బోప‌న్న – ఎబ్డెన్‌ జంట ఈసారి టైటిల్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. న‌వంబ‌ర్ 10వ తేదీన ఇట‌లీ వేదిక‌గా ఏటీపీ ఫైన‌ల్స్ మొద‌ల‌వ్వ‌నుంది. ఎనిమిది రోజుల పాటు సాగే ఈ టోర్నీలో బోప‌న్న జోడీ ఎలైట్ గ్రూప్‌లో ఉంది. ఈ ఏడాది బోప‌న్న – ఎబ్డెన్‌లు ఆస్ట్రేలియా ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ కొల్ల‌గొట్టారు. 43 ఏండ్ల 331 రోజుల వ‌య‌సులో బోప‌న్న గ్రాండ్‌స్లామ్ వీరుడిగా రికార్డు సృష్టించాడు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here