Monday, June 23, 2025
Google search engine
Homeఆంధ్రప్రదేశ్అర్ధరాత్రి ప్రభాస్ ఇంటి ముందు ఫాన్స్ హంగామా … చెదరగొట్టాన పోలీసులు…

అర్ధరాత్రి ప్రభాస్ ఇంటి ముందు ఫాన్స్ హంగామా … చెదరగొట్టాన పోలీసులు…

నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు దింతో తమ అభిమాన హీరో పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కొంతమంది అభిమానులు నిన్న రాత్రి ప్రభాస్ ఇంటి వద్ద హంగామా చేసారు.

సుమారు 500 మంది వరకు ప్రభాస్ ఫ్యాన్స్ నిన్న రాత్రి 11 గంటల సమయంలో ప్రభాస్ ఇంటి దగ్గరకు చేరుకొని హంగామా చేశారు. ప్రభాస్ కి మేము విషెస్ చెప్పాలంటూ ప్రభాస్ ఇంటి దగ్గర హంగామా చేశారు. బ్యానర్లు, క్రాకర్స్, కేకులు పట్టుకొచ్చారు. అయితే అర్ధరాత్రి ఇలా హంగామా చేయడంతో పోలీసులు చేరుకొని అభిమానులను వారించారు.
దింతో ప్రభాస్ అభిమానులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభాస్ ను మేము కచ్చితంగా కలవాలంటూ అభిమానులు రోడ్డుపై బెటాయించారు . దీంతో ఆందోళనకు దిగిన ప్రభాస్ ఫ్యాన్స్ ని పోలీసులు చెదరగొట్టారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments