Home తెలంగాణ వెంగ‌ళ‌రావు న‌గ‌ర్ లోని వివాద స్థ‌లాన్ని ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

వెంగ‌ళ‌రావు న‌గ‌ర్ లోని వివాద స్థ‌లాన్ని ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

0
56
Immediate response to local complaints. Field level investigation along with GHMC officials.. Guaranteed to look into the matter of the place and confirm..
Immediate response to local complaints. Field level investigation along with GHMC officials.. Guaranteed to look into the matter of the place and confirm..

స్థానికుల స్థానికుల ఫిర్యాదుకు తక్షణమే స్పందన..
జీ హెచ్ ఎం సి అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో విచారణ..
స్థల వ్యవహారం పరిశీలించి నిర్ధారిస్తామని హామీ..

హైడ్రా రంగనాధ్ తన విధుల్లో దూసుకుపోతున్నారు తాజాగా వెంగ‌ళ‌రావున‌గ‌ర్ – మోతీన‌గ‌ర్ మార్గంలో క‌బ్జాకు గురైంద‌ని స్థానికుల ఫిర్యాదు మేర‌కు పార్కు స్థ‌లాన్ని ఏవీ రంగ‌నాథ్ సోమ‌వారం ప‌రిశీలించారు. న‌లంద స్కూల్‌కు చేరువ‌లో ఉన్న 9800 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లం పార్కుకోసం కేటాయించార‌ని.. దీనిని త‌మ‌దంటూ కొంత‌మంది ఆక్ర‌మించి ఉన్నార‌ని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సోమ‌వారం రెవెన్యూ, జీహెచ్ ఎంసీ, హైడ్రా అధికారుల‌తో పాటు.. స్థానికుల స‌మ‌క్షంలో క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ చేప‌ట్టారు.

త‌మ‌దంటే త‌మ‌ది అని ముందుకు వ‌చ్చిన వారి వ‌ద్ద ఉన్న ప‌త్రాల‌ను తీసుకుని వ‌స్తే విచారించి.. ఆ స్థ‌లం పార్కుకోసం కేటాయించారా.. ప్ర‌భుత్వ స్థ‌ల‌మా.. ప్రైవేటు వ్య‌క్తుల‌దా అనేది నిర్ధారిస్తామ‌ని రంగ‌నాథ్‌ చెప్పారు. అక్క‌డ ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి ఈ స్థ‌లం జీహెచ్ ఎంసీకి చెందినదిగా బోర్డులు ఏర్పాటు చేయాల‌ని స్థానికులు హైడ్రా క‌మిష‌న‌ర్‌ను కోరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here