ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు..
మొదటి విడతగా 50 మందికి శిక్షణ..
ట్రాఫిక్ మెలుకువలు నేర్చుకోనున్న హైడ్రా, ది.ఆర్.ఎఫ్. సిబ్బంది..
ట్రాఫిక్ పోలీసులకు సహకరించేందుకు సిద్ధమౌతున్నారు హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది. ఈ క్రమంలో గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మొదటి విడతగా 50 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.. ట్రాఫిక్ క్రమబద్దీకరణ మెలుకువలు నేర్చుకునేందుకు హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది సిద్ధం అయ్యారు.

హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు పేరిట ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలు అందించనున్నారు.. ట్రాఫిక్ రద్దీ, ఇతర ముఖ్యమైన సమయాల్లో పోలీసులకు సహకరించే విధంగా హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ల సేవలుంటాయని వివరించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ పేరిట రేడియం జాకెట్లు వేసుకుని సేవలకు సిద్ధమౌతున్నారు హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది.

కాగా 9వర్షాలు, వరదలు.. ఇలా ప్రకృతి వైపరీత్యాలు లేని సమయంలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించే విధంగా హైడ్రా నిర్ణయం తీసుకుంది..
త్వరలో ముఖ్యమైన కూడళ్లలో విధులు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు..