దక్షిణాఫ్రికాతో జరుగుతున్నా టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ టీమిండియా గెలిచింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికాను 61 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్ల దాటికి 141 పరుగులకే అల్ఔట్ చేసింది.
టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా మూడు వికెట్లతో చెలరేగి దక్షిణాఫ్రికా ఓటమికి కారకులయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

భారత బ్యాటర్లలో సంజూ శాంసన్(107) భారీ సెంచరీ చేయగా తిలక్ వర్మ(33), సూర్యకుమార్ యాదవ్(21) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ మూడు వికెట్లు,మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ సాధించారు. ఇ
మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… డర్బన్‌లో మాకు మంచి రికార్డు ఉందన్న విషయం నాకు తెలియదు. ఆ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. గత మూడు నాలుగు సిరీస్‌ల నుంచి మేం మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాం. తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది.
ఇక సంజూ శాంసన్ ఒక అద్బుతం. గత కొన్నేళ్లుగా సంజూ శాంసన్ పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఈ మ్యాచ్‌లో తన స్కోర్ 90లలో ఉన్నప్పుడు కూడా అతడు బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నించాడు. సంజూ ఎప్పుడు వ్యక్తిగత రికార్డుల కోసం ఆడకుండా , జట్టు ప్రయోజానాల కోసం ఎప్పుడూ ఆడతాడు అని సూర్య తెలిపాడు.