వనస్థలిపురం డివిజన్ లోని ప్రధాన సమస్యలపై వినతిపత్రం..
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేయాలని విజ్ఞప్తి..
పెండింగ్ లో ఉన్న మినీ రవీంద్ర భారహిని నిర్మించాలని విన్నపం..
సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి..
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెర వేర్చడానికి కార్పొరేటర్ రావుల వెంకటేశ్వర్ రెడ్డి గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కలసి వినతి పత్రం సమర్పించారు. తన డివిజన్ పరిధిలోని ప్రధానంగా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలతో పాటు వనస్థలిపురం డివిజన్ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా హామీలకే పరిమితమై ప్రధాన సమస్యగా మిగిలిన హుడా ఓపెన్ ఆడిటోరియంలో మినీ రవీంద్ర భారతిని నిర్మించాలని ముఖ్యమంత్రికి కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా విన్నవించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మినీ రవీంద్ర భారతి నిర్మాణం పనులు పూర్తి చేసినట్లయితే ఈ ప్రాంత పేద, మధ్య తరగతి ప్రజలకు అన్ని విధాల ఉపయోగ పడుతుందని ముఖ్యమంత్రికి వివరించినట్లు వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు. అంతే కాకుండా డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారుల నిర్మాణం తో పాటు ప్రతీ కాలనీకి భూగర్భ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణాలు చేపట్టడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రికి అందజేసిన వినతి పత్రంలో కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తాము తెలిపిన సమస్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సంబంధిత అధికారులకు తాను ఇచ్చిన వినతి పత్రాన్ని అందజేసి వెంటనే నిధులు కేటాయించి అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించారు. తమ సమస్యలపై స్పందించి వెంటనే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వనస్థలిపురం డివిజన్ ప్రజల నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.