Monday, June 23, 2025
Google search engine
Homeలైఫ్ స్టైల్నడకను మించిన వ్యాయామం ఎక్కడా లేదు..

నడకను మించిన వ్యాయామం ఎక్కడా లేదు..

నిత్యం కనీసం 8వేల అడుగులైనా వేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు. కానీ, ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లడం అందరికీ సాధ్యంకాదు. అలాంటివారు సాయంత్రపు నడకను ఎంచుకుంటారు. అయితే.. ఉదయపు వ్యాయామం మంచిదా? సాయంత్రం వాకింగ్‌ బెటరా? అన్న అనుమానం చాలామందిని తొలుస్తూ ఉంటుంది. ఏ సమయంలో నడక సాగిస్తే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో చూద్దాం..

తెల్లవారుజామున నడక.. శారీరక, మానసిక ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పార్కుల్లో, ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్‌ చేయడం.. మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఉదయాన్నే శరీరానికి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందితే.. రోజంతా హుషారుగా గడుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండి.. మనిషిలో సృజనాత్మకత పెరుగుతుంది. అది.. పనిపై అనుకూల ప్రభావం చూపుతుంది. జీవక్రియల రేటు పెరిగి.. బరువు కూడా తగ్గుతుంది. మార్నింగ్‌ వాక్‌ వల్ల శరీరంలోని కొవ్వు కరిగి.. శక్తిగా మారుతుంది.

రోజంతా పనిచేసి అలసిపోయిన వారు.. సాయంత్రపు నడకతో రిలాక్స్‌ అవుతారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. గాఢమైన నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి సాయంత్రం నడక మంచి ఫలితాలను అందిస్తుంది. రాత్రి భోజనం తర్వాత ఓ 10 – 15 నిమిషాలు నడిస్తే.. జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి.

నిజానికి ఉదయం నడిచినా.. సాయంత్రం నడిచినా ఆరోగ్యానికి మేలే! కాబట్టి.. మీకు అనువుగా ఉన్న సమయాన్నే వాకింగ్‌ కోసం ఎంచుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments