Monday, June 23, 2025
Google search engine
Homeఆంధ్రప్రదేశ్జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి పయ్యావుల..

జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి పయ్యావుల..

ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిందంటూ గత ప్రభుత్వంపై విమర్శలు
రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి
ఆరోగ్యం, అభివృద్ధి, సంక్షేమం కేంద్రంగా కేటాయింపులు

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను కాపాడడంతో పాటు, సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో వార్షిక బడ్జెట్ కు రూపకల్పన చేశామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. రాబోయే పాతికేళ్ల ఆదాయాన్ని తగ్గించిందని చెప్పారు. గత ప్రభుత్వం అనుసరించిన లోపభూయిష్టమైన విధానాల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంగా 2024–25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు.

బడ్జెట్ లో కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి..

ఆరోగ్య రంగం రూ.18,421 కోట్లు
గ్రామీణాభివృద్ధి రూ.16,739 కోట్లు
జల వనరులు రూ.16,705 కోట్లు
పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి రూ.11,490 కోట్లు
రోడ్లు, భవనాలు రూ.9,554 కోట్లు
పోలీసు శాఖ రూ.8,495 కోట్లు
ఇంధన రంగం రూ.8,207 కోట్లు
గృహ నిర్మాణం రూ.4,012 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు
ఉన్నత విద్య రూ.2,326 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ.322 కోట్లు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments