Home డివోషనల్ మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం

మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం

0
54
Markandeya was a great devotee of Shiva .. Anunityam worshiped Lord Shiva. In the service of that Swami. Such a Markandeya was born as a lowly man.
Markandeya was a great devotee of Shiva .. Anunityam worshiped Lord Shiva. In the service of that Swami. Such a Markandeya was born as a lowly man.

మార్కండేయుడు మహా శివభక్తుడు .. అనునిత్యం పరమశివుడిని పూజించేవాడు. ఆ స్వామి సేవలో .. ఆ స్వామి నామ స్మరణలో మునిగితేలేవాడు. అలాంటి మార్కండేయుడు అల్పాయుష్కుడుగా జన్మించాడు. ఆయన ఆయుష్షు తీరగానే తీసుకువెళ్లడానికి యమధర్మరాజు రాగా, పరమ శివుడు ఆయనను ఎదిరించి మార్కండేయుడికి దీర్ఘాయువును ప్రసాదించాడు.

అలాంటి మార్కండేయుడు మృత్వువు నుంచి బయటపడటానికి ‘ మృత్యు వినాశిని’ అనే తీర్థంలో స్నానమాచరించడం కూడా ఒక కారణమని ‘తిరుప్పేర్ నగర్’ స్థలపురాణం చెబుతోంది. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ఈ క్షేత్రాన్ని ‘బృహత్పురి’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ‘అప్పకుడత్తాన్’ పేరుతోను .. అమ్మవారు కమలవల్లీ తాయారు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటున్నారు. స్వామివారికి ‘అప్పాలు’ అంటే చాలా ఇష్టమట .. అందువల్లనే ఆయనకి ఆ పేరు వచ్చిందని అంటారు. ఇక్కడి మృత్యు వినాశిని తీర్థంలోనే మార్కండేయుడు స్నానమాచరించి దీర్ఘాయువును పొందాడని చెబుతారు. ఇక్కడ స్వామివారు పరాశర మహర్షికి ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here