తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
నిన్నటి శ్రీవారి ఆదాయం రూ. 2. 66 కోట్లు..
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు..
ఇప్పటికి దాదాపు 70 వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు..
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయినట్లు సమాచారం అందుతోంది.. టీబీసీ గెస్ట్‌హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు..

నిన్న స్వామివారిని 63,987 మంది భక్తులు దర్శించుకోగా 20,902 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారికి రూ. 2.66 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.


