Wednesday, February 11, 2026
Google search engine
Homeఆంధ్రప్రదేశ్మాజీ ఎంపీ నందిగం సురేష్ కి చుక్కెదురు..

మాజీ ఎంపీ నందిగం సురేష్ కి చుక్కెదురు..

2020లో వెలగపూడిలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ
ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి
సురేశ్ ను 78వ నిందితుడిగా చేర్చిన పోలీసులు
బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నందిగం సురేశ్
బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు..

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు ఆంద్ర ప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన ఆయనకు నిరాశ ఎదురయింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

ఒకసారి కేసు పూర్తి వివరాలు చూస్తే.. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో వెలగపూడికి చెందిన మరియమ్మ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసులో నందిగం సురేశ్ ను పోలీసులు 78వ నిందితుడిగా చేర్చారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తొలుత గుంటూరు కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన అభ్యర్థనను గుంటూరు కోర్టు తిరస్కరించింది. దీంతో, ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈరోజు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments