Monday, June 23, 2025
Google search engine
Homeఎడ్యుకేషన్మరి కాసేపట్లో ఓపెన్ కానున్న తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్ లింక్..

మరి కాసేపట్లో ఓపెన్ కానున్న తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్ లింక్..

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ 2024
నవంబర్‌ 20 వరకు దరఖాస్తులకు ఛాన్స్‌
జనవరి 1 నుంచి 20 వరకు పరీక్షలు

తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ షెడ్యూల్‌ సోమవారం (నవంబర్‌ 4) విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం టీజీ 2024 షెడ్యూల్‌ ప్రకటించారు. అయితే.. దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం కానుంది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. తొలుత నవంబర్‌ 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అవకాశం కల్పించగా.. తాజాగా మార్పులు చేశారు. దీంతో గురువారం (నవంబర్‌ 7) నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టీజీ టెట్‌ 2024 పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. వివరాలకు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అయితే.. మరికాసేపట్లో రిజిస్ట్రేషన్‌ లింక్‌ ఓపెన్‌ కానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments