Home స్పోర్ట్స్ భారత్ మరియు దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ నేటినుంచి ప్రారంభం

భారత్ మరియు దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ నేటినుంచి ప్రారంభం

0
56
The four-match T20 series against India and South Africa will begin today.
The four-match T20 series against India and South Africa will begin today.

భారత్ మరియు దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ ల టీ 20 సిరీస్ నేటినుంచి ప్రారంభం కానునున్నది. సూర్యకుమార్‌ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. నేడు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ పొట్టి ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియాదే పై చేయి అయినా.. ఈసారి మాత్రం గట్టి పోటీనిచ్చేందుకు దక్షిణాఫ్రికా టీమ్‌ సిద్ధంగా ఉంది. అంతేకాదు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. దాంతో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది.

సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికాపై ఏడు మ్యాచుల్లో 346 పరుగులు చేశాడు. మరో 107 పరుగులు చేస్తే.. భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచుల్లో అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం సూర్య కంటే ముందు దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (452) వున్నాడు.

ఈ సిరీస్‌లో సూర్యకుమార్ మరో 6 సిక్స్‌లు కొడితే.. టీ20ల్లో 150 సిక్సర్ మార్క్‌ను అందుకుంటాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (205), మార్టిన్ గప్తిల్ (173) ముందున్నారు. ప్రస్తుతం సూర్య 144 సిక్స్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. నికోలస్‌ పూరన్ (144) నాలుగు స్థానంలో కొనసాగుతున్నాడు.సూర్యకుమార్‌ యాదవ్ టీ20ల్లో నాలుగు సెంచరీలు బాదాడు. ఈ జాబితాలో గ్లెన్ మాక్స్‌వెల్ (5), రోహిత్ శర్మ (5) ముందున్నారు. ఏ సిరీస్ లో సెంచరీ చేస్తే.వారిని సమం చేస్తాడు .

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here