Home తెలంగాణ సామాజిక న్యాయ సర్వేలో అవకాశం రావడం సంతోషకరం..

సామాజిక న్యాయ సర్వేలో అవకాశం రావడం సంతోషకరం..

0
72
GHMC Congress Party Floor Leader, Lingojiguda Division Corporator Dharpalli Rajasekhar Reddy expressed his happiness that he got the opportunity to participate in the Social Justice Survey conducted by the Telangana Government under the leadership of the State Chief Minister Revanth Reddy.

వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక న్యాయ సర్వేలో పాల్గొనే అవకాశాన్ని పొందినట్లు జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.. బుధవారం నాడు సామాజిక సర్వేలో భాగంగా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి నివాసంలో, ఎల్బ్ నగర్ డిసి సేవ ఇస్లావత్, ఏ ఎం హెచ్ ఓ నగేష్ నాయక్, డిఈ కార్తీక్, సంబంధిత అధికారులు సర్వేలో పాల్గొని కార్పొరేటర్ ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని సామాజిక అసమానతలను అర్థం చేసుకొని, వాటిని పరిష్కరించుకునేందుకు కృషి చేయడంలో భాగంగా ఇటువంటి కీలక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి పౌరుడి సంక్షేమం పట్ల తీసుకునే బాధ్యతను సర్వే ప్రతిభంబిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సర్వేకు సహకరించి తమ తమ వివరాలను ఇవ్వాలని కోరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here